Tuesday, August 19, 2008

కన్నులకు ఇవేవీ తెలియవులే...

కన్నులు చూసేది నిజాము కాదె...
మనసులు దాచేవి కలలు కావే...
ఎన్ని రోజులు వేచిన రావే...
వెంట వస్తే మాయం ఇపోతావే...
కల అని అనుకుంటే ఎదురుగ వస్తావే...
నిజం అని అనుకుంటే వేల్లిపోతవే...
కన్నులకి ఇవేవీ తెలియవులే...

ఆకాశం ఎటు ఎగిరే మనసు...

నేను వచ్చి ఉన్నా...తన రాక కోసం చూస్త ఉన్నా...
అప్పుడే మారే ఈ గాలితో...ఆమెను చూసి...
మరిచిపోయా నా పేరు...అడుగు ముందు వేసి...
అడిగా ఒక మాట...యెదలో మొదలయ్యే ఒక ఆట...
తను ఆ కళ్ళతో...నన్ను మార్చే...
నా గుండెలో ఒక రాయి వేసే..ఊపిరి బిగించి చూసా...
ఆ తేయ్యని మాట విన్న...నే విన్న క్షణం...
ఆకసం ఏతు ఎగిరే నా మనసు...

చెలి చిరునామా...

ఓ చెలి..నీ చిరునామా కోసం నేను వెతికిన ప్రతి క్షణం...
నీ ధ్యాసలో పది నాకు తెలియక సాగిన్పోయిన కాలం..
నీ కోసం నా మనసు పెంచుకున్న వ్యామోహం..
ఈ మనసు పలికెడి..
నీ ప్రేమ కోసం..
నీవు నాపై చూపిన ప్రేమ..
ఒక అంతులేని సాగరం..
నీ చిరునవ్వులతో నిండే నా ప్రతి కలవరం..
నీతో గడిపిన కాలం..ఒక తీపి జ్ఞాపకం..
నీ చిరునవ్వు తో..
ఆనందిచెను లే లోకం..
నా ఈ రచన బాగా గమనించు..
దూరం నించి ఈ కవిత రూపం..
నేను నీ ఉ ఇచ్చే పుష్పం..

వరదలు - మరదలు

వంసధరకు వచ్చాయి వరదలు
మా ఇంటికి వచ్చింది మరదలు
వరదలు పోగ మిగిలాయి బురదలు
మరదలు పోగ మిగిలాయి దురదలు

Vastunna

త్వరలో వస్తున్నా......

Thursday, August 7, 2008

నా తోడు ఎవరే...
నా తోడు ఎవరే...
బొమ్మరాజుదుర్గాప్రసాద్‌
రాత్రి నాన్న ఆ విషయం ప్రస్తావించినప్పటి నుంచి అదే ఆలోచిస్తున్నా...
ఏదో ఒకరోజు ఈ పరిస్థితి వస్తుందని తెలుసు. మరీ ఇంత తొందరపడుతుందని ఊహించలేదు. కొద్దిగా సందిగ్ధం... గుండెల్లో, గొంతులో ఏదో తడబాటు... చిన్న ఆలోచన కూడా లేకుండా పెద్ద నిర్ణయం తీసుకోవడం!?
హఠాత్తుగా జీవితంలో వచ్చే ఈ మార్పును ఎలా ఆహ్వానించాలి? ఇది నాకు అనుకూలంగా ఉంటుందా... ప్రతికూలంగా ఉంటుందా...?
అమ్మ, నాన్న నాకు ఎంత స్వేచ్చ ఇచ్చినా నే కోరుకున్నది సాధించుకోగలనా... నా భావాలకు తగ్గ పరిస్థితుల్ని నేను సృష్టించుకోగలనా... కొన్ని క్షణాల నిర్ణయంతో నేను అడుగులు వేసేది అజ్ఞాత ప్రపంచపు చీకట్లోకా... నా ఊహల్లో తళుకులీనే అద్భుత భావనాలోకంలోకా...!?
అసలు ఒకమ్మాయి తన ఆలోచనలకు అనుగుణంగా స్వేచ్చగా నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉందా?
రాత్రి పడుకోబోయే ముందు అమ్మ, నాన్న పిలిచారు. ''ఏమ్మా ఫైనలియర్‌ పరీక్షలు బాగా రాశావు కదా'' అంటూ ప్రారంభించి అసలు విషయంలోకి వచ్చారు.
''ఈ సంవత్సరం నీ పెళ్ళి చేసేద్దామనుకుంటున్నాం...'' అని కాసేపాగి ''కాలం మారిపోయింది... కాలేజి చదువుల్లో ఎందరో తారసపడుతుంటారు. స్నేహితులవుతారు... సన్నిహితులవుతారు. మీకూ కొన్ని ఆలోచనలుంటాయి. మరి నీ దృష్టిలో ఎవరైనా ఉన్నారా...'' అంటూ అర్ధోక్తిలో ఆగారు. నాన్న మాటలు ఎప్పుడూ ఆయనపై గౌరవాన్ని మరింత పెంచుతూనే ఉంటాయి. మరోసారి ఆయన్ను ఎడ్మైరింగుగా చూస్తూ ''అలాంటిదేం లేదు నాన్నా'' అంటూ గొంతుకు అడ్డుపడుతున్న బెరుకును తప్పించుకుంటూ నెమ్మదిగా సమాధానం చెప్పాను.
ఆయన ఉపాధ్యాయుడు. పిల్లల మనస్తత్వం బాగా తెలిసిన వ్యక్తి. అన్నింటినీ అవగాహన చేసుకుంటూ స్నేహితుడిలా మమ్మల్ని పెంచారు. క్రమశిక్షణ పేరుతో అడ్డుకున్నదీ లేదు; ఆ స్వేచ్చను మేం దుర్వినియోగం చేసిందీ లేదు. అమ్మానాన్నలు పంచిన ప్రేమవల్ల బయట సన్నిహితులున్నారేవోగానీ... అమ్మానాన్నలను మించిన ప్రేమికులు ఎవరూ లేకపోయారు.
మా ఇంటిని చూస్తేనే నాకెంతో ఆనందం. సరదాగా ఎప్పుడూ ఆట పట్టిస్తున్నట్టుండే అన్నయ్య. వాడు ఇంజినీరింగు చదువుతున్నాడు- కర్ణాటకలో. నేను పక్కనలేందే నిద్రపోని తమ్ముడు- ఇదే ఊళ్ళో తొమ్మిదో తరగతి. వాడు... అమ్మానాన్నా... నిజంగా మా ఇల్లు ఎంతో హాయిగా ఉంటుంది. మా స్నేహితులకు కూడా ఈ ఇల్లంటే ఎంతో ఇష్టం. ''ఏమ్మా, ఏదో ఆలోచిస్తున్నావు. మీ సత్యం మామయ్య ఏదో సంబంధం ఉందని ఫోన్‌ చేశాడు. నిన్నో మాట అడిగి ముందుకు వెళ్దామనుకుంటున్నాం. వివరాలు తెలుసుకోమని చెబుతాను. సరేనా'' అంటూ ముగించారు.
అప్పటినుంచి ఒకటే ఆలోచనలు...
నిజమే... నాకంటూ ఆలోచనల్లో ఎవరూ లేరు. నేను ఎవర్నీ ప్రేమించిందీ లేదు. కానీ ఒక తోడును ఎంచుకోవడం నాలాంటి మనస్కురాలికి చాలా కష్టమే.
పెళ్ళిచూపులంటారు. అపరిచిత వ్యక్తులు బిలబిలమంటూ వస్తారు. వాళ్లముందు కూర్చుని... కొత్తగా గుచ్చుకునే చూపులు... వారి ప్రశ్నలు... శల్యపరీక్షలు-హక్కులు, బాధ్యతలు-ఒప్పందాలు... ఏమిటిదంతా... దీన్ని తప్పించుకునేదెలా...!
అతను ఎవరో తెలియదు. నే రాసుకునే చిరు కవితలకు అతని గుండె బదులు పలకగలదా!? నా గొంతు పలికే సరిగమలకు అతని గొంతు జత కలవగలదా? కనీసం ఆ స్వరాల ఆర్ద్రతకు అతను స్పందించగలడా... నాతో కలిసి వెన్నెల సముద్రంలో స్నానమాడగలడా...!?
కాలేజీలో ఎన్నో చెప్పాను నా స్నేహితురాళ్లకు. ఈ చూపులు... వ్యవహారాలకు మనం చాలా దూరం అని కబుర్లు చెప్పాను. ఇప్పుడు ఇదేమిటి ఇలా... ఏం చేయాలి...
నాన్న నా ఆలోచనలను ఎంతగా గౌరవించినా ఆయన మాత్రం ఏం చేయగలరు. అసలు ప్రత్యామ్నాయం ఏదైనా ఉందా...!
ఆలోచిస్తూనే టీవీ ఆన్‌ చేశాను. హిందీ సినిమా వస్తోంది. షారుక్‌ఖాన్‌, మాధురీ దీక్షిత్‌...
'దేవుడు ప్రతి మనిషికీ సరైన తోడును ఎక్కడో అక్కడ సృష్టించే ఉంటాడట' ఒక క్యారెక్టర్‌ డైలాగ్‌ చెబుతోంది.
నా పెదవులపై సన్నని చిరునవ్వు.

***
కాలింగ్‌బెల్‌ వోగుతోంది.
తలస్నానం చేసి జుట్టు ఆరబెట్టుకుంటున్న నేను ఎవరై ఉంటారబ్బా అనుకుంటూ తలుపు తీశాను.
''వెంకట్రా... వెంకట్రామయ్య గారున్నారా?'' అంటూ ఎదురుగా ఓ అపరిచిత యువకుడు.
''నాన్నా అమ్మా ఉదయమే పక్క ఊరు వెళ్ళారు- ఏదో ఫంక్షను ఉందని'' చెప్పాను నేను.
వెళ్ళాలా... ఉండాలా అని అతను సందిగ్ధపడుతుంటే లోపలకు రమ్మని ఆహ్వానించాను.
తన పేరు శరత్‌ అనీ హైదరాబాద్‌లో సాఫ్ట్‌వేర్‌ ఇంజినీరుగా పని చేస్తున్నాననీ పరిచయం చేసుకున్నాడు. వాళ్ళ నాన్నగారు- నాన్న స్నేహితులట. ఇటు పనుండి వస్తుంటే కలిసి రమ్మనడంతో వచ్చాడట. సమయానికి ఇంట్లో తమ్ముడు కూడా లేడు.
నల్లటి జీన్స్‌... స్కై బ్లూకూ నేవీ బ్లూకూ మధ్యలో లైటుగా ఉండే ప్లెయిన్‌ కలర్‌ షర్టు ప్యాంటు లోపలికి టక్‌ చేశాడు. జుట్టును కొంచెం నిర్లక్ష్యంగా వదిలేశాడు. హుందాగా వచ్చి కూర్చున్నాడు. గదిని పరిశీలనగా చూస్తూ కొంచెం అనీజీగా కదలి... ''పోనీ... మరోసారి వస్తాన్లెండి'' అంటూ లేవబోయాడు.
''అంతదూరం నుంచి వచ్చారు. నాన్న మధ్యాహ్నానికల్లా వచ్చేస్తారు'' అన్నాను.
అందుకు అంగీకరించినట్లుగా ఇంకేం మాట్లాడలేదు అతను.
ఇప్పుడే వస్తానంటూ నేను కిచెన్‌లోకి వెళ్లి, రెండు కప్పుల కాఫీ కలిపి తీసుకువచ్చాను. శరత్‌ బుక్‌షెల్ఫ్‌ ముందు నిలబడి పుస్తకాలు చూస్తున్నాడు.
నన్ను చూసి నవ్వి- ''బుక్స్‌ గ్రూపుగా భలే డిజైన్‌ చేశారే. నావల్స్‌, కధలు, కవితలు, పర్సనాలిటీ డెవలప్‌మెంటు... వాహ్‌... నైస్‌'' అన్నాడు. మళ్ళీ తనే ''ఎవరో సాహిత్యాభిమానులు ఉన్నట్లున్నారు'' అన్నాడు. చిన్నగా నవ్వాను. అది నేనే అని చెప్పడం ఇష్టంలేక.
''విత్‌ యువర్‌ పర్మిషన్‌'' అంటూ వడ్డెర చండీదాస్‌ పుస్తకం హిమజ్వాల తీసుకున్నాడు.
వచ్చి మళ్ళీ ఎదురుగా కూర్చున్నాడు. ప్రశాంతంగా కాఫీ సిప్‌ చేశాడు. కప్పు టేబుల్‌పై పెట్టి ఆ పుస్తకం తెరిచాడు.
చిన్నగా నవ్వి- ''పేరు, పుస్తకం కొన్న తేదీ, సమయం, ఊరు... భలే రాశారే! సాహితీ మీరేనా!''
అవునన్నట్లుగా తల ఊపాను. ఒకసారి తలెత్తి కళ్ళలోకి సూటిగా చూసి మళ్ళీ తలదించుకున్నాడు. పేజీలు కదిలిస్తున్నాడు.
'ఆలోచించి... ఆలోచించి ఏదో పొందాలనుకోవడం తప్ప జీవితంలో నేనేమీ పొందలేకపోయాను' ఆ నవలలో ఒక క్యారెక్టరు మాటలను పైకే అన్నాడు.
''ఎందుకో చండీదాస్‌ అంటే నాకు చాలా ఇష్టమండి. అతని పుస్తకాలూ బంధాలూ బంధుత్వాలూ... అంతా ఒక ఫిలాసఫికల్‌ టచ్‌ కనిపిస్తుంది. అంతేనంటారా...''
అవునన్నట్లు తల ఊపాను.
మళ్ళీ అతనే ''పుస్తకాలను మించిన స్నేహితులు ఎవరుంటారు. ఎంతటి ఒంటరితనంలోనైనా అవే అసలైన నేస్తాలు'' అన్నాడు.
''కవితలు చదువుతారా'' అన్నాడు.
''తిలక్‌ భావకవితలు ఇష్ట''మన్నాను.
అతనే మళ్ళీ సన్నగా 'నువ్వు లేవు- నీ పాట ఉంది... ఇంటిముందు జూకా మల్లెతీగల్లో అల్లుకుని లాంతరు సన్నని వెలుతురులో చిక్కుకుని' అంటూ మళ్ళీ సన్నగా నవ్వాడు.
కొంచెం ఉత్సాహం కలిగింది. ''తిలక్‌ పోస్టుమాన్‌ కవిత చదివితే ఈ రోజుల్లో ఎవరికీ ఏం అర్థంకాదేవో...'' అన్నాన్నేను.
అతను ఆసక్తిగా చూశాడు నావైపు. ఎందుకో అతని కళ్ళల్లో అదోలాంటి పరిశీలన... అతని కళ్ళల్లో నా కళ్ళు చిక్కుకుని... రెండైన నాలుగు కళ్ళూ మళ్ళీ కలవరపడి విడిపోయాయి.
కొన్ని క్షణాల నిశ్శబ్దం...
''మాదంతా కంప్యూటరు ప్రపంచం. పుస్తకాలమాట ప్రస్తావించేవారే అరుదు. అంతా అదో హడావుడి. ఈ ప్రశాంత పల్లె వాతావరణం చాలాకాలం తర్వాత మళ్ళీ చూస్తున్నా. అందులోనూ ఇలా అభిరుచులు పంచుకోవడం చాలా హాయిగా ఉంటుంది'' అన్నాడతను.
''స్టేట్స్‌ వెళ్ళే ఆలోచన లేదా...'' అడిగాను.
''అమ్మను వదిలి హైదరాబాద్‌ వెళ్ళడమే కష్టమయింది'' అంటూ నవ్వాడు. అతను ఎప్పుడూ నవ్వుతూనే ఉంటాడనుకుంటా.
మళ్ళీ తనే ''సెంటిమెంటు అనుకోండి... మరేదైనా అనుకోండి. దేశాన్ని వదిలి వెళ్ళడం కొంచెం కష్టమే. ఆత్మీయానురాగాలను వదులుకుని ఎక్కడికో వెళ్ళిపోవడం నాకు అంత ఈజీ కాదు'' అన్నాడు.
నాకు టీవీ పెట్టాలని ఉంది. ఎంతో ఇష్టమైన ఎస్పీ బాలు సంగీత కార్యక్రమం వస్తుందిప్పుడు. టైం అవుతోంది. అందులోనూ ఫైనల్‌... అందరూ చాలా బాగా పాడుతున్నారు. పాటలనూ రాగాలనూ నాటి స్వరబ్రహ్మలు, సాహితీమూర్తుల అనుభవాలనూ చెబుతూ కార్యక్రమాన్ని నడిపించే బాలసుబ్రహ్మణ్యం యాంకరింగు ఇంకా నచ్చుతుంది.
ఎదురుగా ఎవరో కూర్చుంటే టీవీ ఆన్‌ చేయడం ఇష్టం ఉండదు. ఇంతసేపు అతను అసలు టీవీ సంగతే ప్రస్తావించలేదు. అతను చేతివాచీ చూసుకుంటూ ''మీకు అభ్యంతరం లేకపోతే ఎస్పీ 'స్వరలహరి' చూద్దామా'' అన్నాడు.
సరిగ్గా మన అభిరుచులూ అభిప్రాయాలూ ఎదుటివారిలోనూ కనిపిస్తే ఉత్సాహం ఉరకలేస్తుంది. హఠాత్తుగా శరత్‌ ఎవరో పరాయివాడు అన్న భావన ఎక్కడో జారిపోయింది. టీవీ ఆన్‌ చేశాను. బాలు అప్పుడే జడ్జిలను వేదికపైకి పిలుస్తున్నాడు. వారిలో పుగళేంది ఒకరు.
మహదేవన్‌-పుగళేందిల అనుబంధాన్ని హృద్యంగా వివరిస్తున్నాడు. ఈ కార్యక్రమాన్ని మనసుకవి ఆత్రేయకు అంకితం ఇస్తున్నట్లు ప్రకటించాడు.
'నేను అప్పుడు చాలా చిన్నవాడిని. ఆయన పిలిపించుకుని ఎప్పుడూ ఒక పాట పాడించుకునేవారు'- అని బాలు అంటుండగానే ''నేనొక ప్రేమ పిపాసిని... నీవొక ఆశ్రమ వాసివి'' అంటూ మా ఇద్దరి గొంతులు ఒకేసారి పలికాయి. ఇద్దరం నవ్వుకున్నాం. ఇంతలో బాలు సరిగ్గా అదే పాట అందుకున్నాడు.
ఆ తీయనయిన ప్రవాహం సగం ఎపిసోడ్‌గా మధ్యలో ఆగిన వెంటనే ''ఏదైనా పుస్తకం చదువుతుండండి... క్షణంలో లంచ్‌ ప్రిపేర్‌ చేస్తాను'' అంటూ కిచెన్‌లోకి దారితీశాను.
ఎవరో అపరిచితుడిని హాల్లో వదిలేసి వెళ్తున్న భావన లేదిప్పుడు. బియ్యం కుక్కర్‌లో పెట్టి ఆలూ, ఉల్లిగడ్డలు కోసి కూర చేద్దామని తీస్తుండగా శరత్‌ 'ఎక్స్‌క్యూజ్‌మీ' అంటూ కిచెన్‌లోకి వచ్చాడు.
''ఏంటీ, సొంత ఇంట్లోలా ఇలా వచ్చేస్తున్నాడనుకుంటున్నారా'' అంటూ అడుగులు ముందుకు వేశాడు.
''ఆఁ... ఆఁ... ఫర్వాలేదు. రండి... రండి... ఇలా కూర్చోండి'' అంటూ డైనింగు టేబుల్‌ ఎదురుగా ఉన్న కుర్చీ జరిపా.
''మీరొక్కరే పనిచేస్తుంటే, నేను ఖాళీగా కూర్చోవడమా- కుదరదు. ఏదైనా పని ఉంటే నేనూ చేస్తా'' అన్నాడు.
''వద్దు... ఫరవాలేదు'' అంటూ అడ్డు చెప్పబోయినా మనసులో అతను అన్న మాటలకు గౌరవం కలిగింది.
''ఓహో... నిమ్మకాయలు, క్యారెట్‌, మామిడల్లం ఉన్నాయా... ఇంకేం'' అంటూ పొడుగుచేతుల చొక్కాను పైకి మడతపెట్టి వాటినందుకున్నాడు. చాకుతో సన్నగా కట్‌ చేశాడు. వాటిపై కాస్త నిమ్మరసం పిండి, కొంచెం ఉప్పు కలిపి సలాడ్‌ చేశాడు.
వెంటనే నాకేసి చూసి చిన్నగా కాలరెగరేసి అంతే సన్నగా నవ్వి ''భయపడకండి... బానే ఉంటుంది'' అన్నాడు.
అతని మాటలకు ముచ్చటేసింది. కబుర్లతోనే లంచ్‌ ముగించి మళ్ళీ హాల్లోకి వచ్చాం. ''నాన్న ఈపాటికి బయలుదేరే ఉంటారు. కాసేపట్లో వచ్చేస్తారు'' అన్నాను.
''ఒక్క క్షణం... ఇప్పుడే వస్తాను'' అంటూ అతను షూ వేసుకుని ఎక్కడికో వీధి వైపు కదిలాడు.
అతనలా వెళ్ళాడో లేదో... ఫోను వోగింది. అవతలి నుంచి నాన్న- ''అమ్మా సాహితీ... ఈ రాత్రికి ఇక్కడే ఉండిపోవాల్సి వస్తోంది...'' అంటూ ఆయన మాట్లాడుతుండగా మధ్యలో శరత్‌ విషయం చెప్పాను. శరత్‌ తండ్రి పేరు నేనూ తెలుసుకోలేదు. సమయానికి తనూ లేకుండాపోయాడు. నాన్న అతను ఎవరన్నది సరిగ్గా గుర్తుపట్టలేదు. ''రాత్రికి ఉండమని చెప్పు, రేపు మేం వచ్చేస్తాం. ఎలాగూ అన్నయ్య కూడా ఇవాళ సాయంత్రానికి వస్తున్నాడు కదా...'' అని చెప్పి ఫోన్‌ పెట్టేశారు.
ఇంతలో శరత్‌ రానే వచ్చాడు. నాన్న ఫోన్‌ సంగతి చెప్పాను. 'అయ్యో!' అనుకుంటూ ''ఈ రాత్రికే నాకు ట్రైను రిజర్వేషన్‌ అయింది. మళ్ళీ వచ్చినపుడు కలుస్తానని చెప్పండి'' అంటూ బయలుదేరబోయాడు.
ఏదో చెప్పడానికి సిద్ధపడి... మళ్ళీ సంశయించినట్లుగా అనిపించింది.
వెళ్లబోతున్న శరత్‌ని ఆగమన్నాను. లోపలి నుంచి ఠాగోర్‌ 'గీతాంజలి' పుస్తకం తెచ్చి 'శుభాకాంక్షలతో- సాహితి' అని రాసిచ్చాను... ఎందుకో అతనికి నా గుర్తుగా ఏదో ఒకటి ఇవ్వాలనిపించి.
శరత్‌ వెళ్ళిపోతుంటే మనసులో ఏదో కదలిక... ఒక ఆత్మీయుడు వీడిపోతున్న భావన...
ఆ సాయంత్రం డాబాపై సంధ్య చీకట్లోకి చిక్కబడుతున్న వేళ... పశ్చిమాకాశం వంక చూస్తుంటే అలా అలలు అలలుగా... ఏవో భావాలు...
'దేవుడు ప్రతి మనిషికీ సరైన తోడును ఎక్కడో అక్కడ సృష్టించే ఉంటాడట...'
ఆ డైలాగు మళ్ళీ గుర్తొచ్చింది. మనసులో ఏవో కదలికలు... సందిగ్ధాలు... సందేహాలు...
మర్నాడు అమ్మానాన్నా వచ్చారు. శరత్‌ ఎవరో నాన్నకు ఎంతకీ గుర్తురాలేదు.

***

మరికొన్ని రోజులు గడిచిపోయాయి.
నాన్న మళ్ళీ సత్యం మామయ్య సంగతి ఎత్తలేదు. సంబంధం గురించి ప్రస్తావించలేదు. వాళ్లేమైనా వద్దన్నారా... నేను బాధపడతానని చెప్పడం లేదా... ఏదైతేనేం... అంతా మన మంచికే అనిపించింది. అమ్మ ఎందుకో ఆరోజు హడావుడిగా ఉంది. ఏమిటా సంగతని ఆరా తీస్తే- ఎప్పుడో చిన్ననాటి స్నేహితురాలు వస్తోందని చెప్పింది. ఆమెను ఎప్పుడో పెళ్ళికి ముందు చూసిందట. ఆంటీ, అంకుల్‌ వస్తున్నారని చెప్పింది. వాళ్ళమ్మాయి కూడా వస్తోందట... తనకి కంపెనీ ఇవ్వాలి. ఈరోజు ఏ పనులూ పెట్టుకోవద్దని మరీ చెప్పింది అమ్మ.
అనుకున్నట్లుగానే కొద్దిసేపట్లోనే వారంతా వచ్చారు. వస్తూనే ఆంటీ అమ్మతోనూ... అంకుల్‌ నాన్నతోనూ సెటిల్‌ అయిపోయారు. వాళ్ళమ్మాయి నిర్మలను నా గదిలోకి తీసుకువెళ్ళాను. ఆ అమ్మాయి కంప్యూటరులో డిగ్రీ చేస్తోందట. సరదాగా ఉంది... బాగా కలివిడిగా ఉంది. ఎందుకో నేనంటే బాగా అభిమానం చూపుతోంది.
హైదరాబాద్‌లో ఎప్పుడో సెటిలయ్యారట... ఈ గోదావరి తీరానికి వచ్చింది ఈమధ్యేనట... భోజనాలయ్యాక పట్టిసీమ వెళ్ళాలని వారి ఆలోచన.
ప్రశాంత గోదావరి మధ్య కొండపై వెలిసిన పట్టిసీమ వీరభద్రస్వామి. ఆ కోవెల ఎంతో ప్రశాంతం... పడవపై గోదారి దాటడం... అందమైన అనుభూతి. నాన్నకి కొలీగ్‌ ఇంట్లో సాయంత్రం ఏదో ఫంక్షను ఉండటంతో వాళ్లతో నేనే వెళ్ళా.
నిర్మలకు అన్నయ్య ఒకరు ఉన్నారట. హైదరాబాద్‌లో ఏదో ప్రయివేటు సంస్థలో జాబ్‌ చేస్తారట. అతనంటే ఆమెకు ఎంతో ఇష్టమట.
నిర్మల మాట తీరు... వ్యవహారం అంతా బాగానే ఉంది- వాళ్ళన్నయ్యను పొగడ్డం తప్ప.
ఆంటీ, అంకుల్‌ చక్కగా ఉన్నారు. బాగా మాట్లాడుతున్నారు. ఆ సాయంత్రం గోదావరి తీరంలో పట్టిసీమ ఆలయంలో ఎంతో హాయిగా గడిచిపోయింది.
రాత్రి ఇక వారు గౌతమి ఎక్స్‌ప్రెస్‌కు బయలుదేరుతున్నారు. వెళ్తూ... వెళ్తూ... అనుకున్నట్లుగానే ఆ బాంబు పేల్చారు.
ఈ బంధాన్ని మరింత సన్నిహితం చేసుకుంటే బావుంటుందేవో... ఆలోచించమన్నారు. పరోక్షంగా వాళ్ళబ్బాయి విషయం ప్రస్తావించారు. హఠాత్తుగా ఎందుకో శరత్‌ గుర్తొచ్చాడు. మనసులో కొంచెం దిగులుగా అనిపించింది.
ఇంతలో నాన్న ''అంతకన్నా మహాభాగ్యం ఏముంది... తప్పకుండా'' అనేశారు వాళ్ళతో. ఇదేమిటి... నాతో మాట మాత్రం చెప్పకుండా నాన్న ఇలా అనేశారేమిటి. ఇంతకాలం నా మాటకు ఎంతో గౌరవం ఇచ్చారు. నా మనసులో ఎవరూ లేరన్నానని ఆయన తొందరపడ్డారా... కొద్దిగా ఏ మూలో ఆందోళన. కనీసం అతన్ని చూడనయినా లేదు... ఇప్పుడెందుకు ఇలా మాట వదిలేశారు. ఎక్కడో సందిగ్ధం... రాత్రంతా కలత నిద్ర...
ఆందోళన నిద్రని దూరం చేసినా నాన్నపై నమ్మకం నన్ను ఓదార్చింది.

***

ఆరోజు అమ్మ పిలిచింది. నాన్న అక్కడే ఉన్నారు.
''అమ్మా... నీ పెళ్ళి ఖాయం చేద్దామనుకుంటున్నాం...'' అన్నారు.
నేనేమీ మాట్లాడలేదు...
''అదే, ఆరోజు వచ్చారు కదా- అంకుల్‌, ఆంటీ... వాళ్ళబ్బాయే''.
నా ముఖకవళికల్లో మార్పులు...
నాన్న అమ్మకు సైగ చేశారు.
అమ్మ చేతిలో ఏదో ఫొటో...
ఏమిటి, ఇలా ఫొటో చూసి నిర్ణయించుకోవాలా?
వెుహమాటంగానే ఆ ఫొటో చేతిలోకి తీసుకున్నా. చూసేసరికి ఆశ్చర్యం... అది... అది... శరత్‌ ఫొటో...!
''నాన్నా! ఇదేమిటి... ఇతను మీ ఫ్రెండు కొడుకు కదా... మరి వెున్న వచ్చిన ఆంటీ, అంకుల్‌కు సంబంధం ఏమిటి?''
నాన్న నవ్వుతున్నారు.
నెమ్మదిగా చెప్పడం ప్రారంభించారు.
''వాళ్ళెవరూ ఎవరికీ స్నేహితులు కారు... సత్యం మామయ్య చూసిన సంబంధం అదే. నేను, సత్యం మామయ్య అతన్ని(శరత్‌) కలవడానికి వెళ్ళాం. శరత్‌- ఈ తతంగం తనకిష్టంలేదని చెప్పాడు. పెళ్ళిచూపులకంటూ వచ్చి ఒకమ్మాయిని అవమానించలేనన్నాడు''.
''అమ్మా... ఇప్పుడు చెప్పు- వాళ్ళ సంబంధం ఓకే చేద్దామా?'' అడిగారు నాన్న.
మనసులో అదోలాంటి ఉత్సాహం ఉరకలేసింది. గుండెలోంచి ఒంట్లోకి రక్తం వేగంగా పరుగులు తీస్తున్నట్లనిపించింది. నిశ్శబ్దంగా అమ్మానాన్నల మధ్య కూర్చుని ఇద్దరినీ చెరో చేత్తో చుట్టేశా.
నా సమాధానం వాళ్ళకి అర్థమయింది. అంగీకారం తెలిపాను కానీ... నాలో ఎక్కడో ఏదో అలజడి. ఏమిటిదీ... అంతా బాగానే ఉంది కదా అని ప్రశ్నించుకున్నా. అయినా... ఏమిటో...
కొంచెం ఆలోచించా... ఆఁ... అర్థమయింది... శరత్‌- నా దగ్గర నిజం దాచి... మిగిలిన వాళ్ళకి అసలు సంగతులు చెప్పేశాడా... ఇలా వోసం చేస్తాడా... హన్న... సరే... ఆ మూడుముళ్ళు పడనీ... సంగతి చూసుకుందాం... అనుకున్నా.
అంతే... అలజడి కాస్తా ఆనందమైంది. మధురోహలతో మనసు ఎటో వెళ్ళిపోయింది

posted by telugu sevaka at 3:20 AM 1 comments
భలే భలే అందాలు!

http://eenadu.net/vipnew3/display1.asp?url=vip-kathalu3.htm
భలే భలే అందాలు!
అజిత్‌కౌర్‌
పంజాబీ కధ
రషీద్‌ బాధతో విలవిలలాడిపోయాడు. నేలంతా గిర్రున తిరిగిపోయింది. ఆకాశం తలక్రిందులౌతోంది. బాధ భరించలేని స్థితిలో హాస్పిటల్‌కెళ్లాడు. టెస్ట్‌లన్నీ చేశాక బయాప్సీ చేయాలని డాక్టర్లన్నారు.
''బయాప్సీ! అంటే కేన్సరని అనుమానమా డాక్టర్‌'' అని అడిగాడు రషీద్‌.
''లేదు. కేవలం సందేహ నివృత్తికోసమే చేస్తాం.''
''ఎప్పుడు రమ్మంటా''రని అడిగాడు రషీద్‌.
''వచ్చే మంగళవారం రండి. మీతో ఎవరో ఒకరు వస్తారుగా. జనరల్‌ వార్డులో వారు మీతో వుండొచ్చు''.
''లేదండి. ఎవరూ రారు. నేనే వస్తాను'' చిరునవ్వుతో అన్నాడు.
''మీ భార్య బిడ్డలు?''
నవ్వి- ''నా భార్య గత సంవత్సరమే అల్లా దగ్గరకెళ్లింది. కొడుకు అమెరికాలో వున్నాడు అన్నాడు''
బయాప్సీ రిపోర్టుకోసం హాస్పిటల్‌కెళ్లినపుడు రషీద్‌ కొడుకు వివరాలడిగాడు డాక్టర్‌.
''మీరు నాకంటే నా కొడుకు తెలివైన వాడని, ధైర్యస్థుడని అనుకొంటున్నారా? ఏదైనా విని తట్టుకొనే మనోబలం నాకుంది'' అంటూ నవ్వాడు.
డాక్టర్లు ఎంతో శాంతంగా మెల్లగా రషీద్‌కు జీర్ణాశయంలో కేన్సర్‌ అని చెప్పారు.
''కేన్సరా! తన శరీరంలో జీర్ణాశయమనే సంచిలో తన పొట్ట క్రమంగా కుళ్లిపోతూందన్నమాట, పాచి మాంసం ముక్కలా! అందులో కోట్లాది సూక్ష్మజీవులు వృద్ధి చెందుతూ వుంటే తనకు దాని జాడైనా తెలియలేదు. దుర్వాసనైనా రాలేదు'' రషీద్‌కు ఆశ్చర్యంగా వుంది. ఆలోచిస్తున్నాడు.
ఈ విషయం విని షాక్‌లో వుండిపోయాడేమోనని సానుభూతిగా రషీద్‌ చేతిని నొక్కి ''మీ అబ్బాయిని అమెరికా నుండి పిలిపించండి. కేన్సర్‌ చికిత్సకు ఏర్పాట్లు చేయొచ్చు. ఆపరేషన్‌ కూడా జరగొచ్చు. మంచి మందులున్నాయి. కరెంట్‌ ట్రీట్‌మెంట్‌ వుంది. ప్రస్తుతం గాబరా పడాల్సినపని లేదు'' అన్నారు డాక్టర్‌.
రషీద్‌ మందహాసం చేస్తూ ''చికిత్స జరక్కపోతే ఎంతకాలం?'' అనడిగాడు.
''ఒకటి రెండేళ్లు. ఇంకా ఎక్కువైనా కావచ్చు. మందులు క్రమంగా వేసుకోవాలి. తరచూ చెకప్‌ చేయించుకోవాలి. ఐనా నొప్పి పెరగొచ్చు. హాస్పిటల్లో చేరే పరిస్థితీ రావచ్చు. భయపడకండి. అన్నిటికీ మందులున్నాయి. మా సలహా పాటించి అబ్బాయిని వెంటనే పిలిపించండి. రెండు మూడు వారాల్లో హాస్పిటల్‌లో చేరితే మా ప్రయత్నాలు మేం చేస్తాం!! అన్నారు ఇతర డాక్టర్లు.
''మందులు కూడ తీసుకోకపోతే?''
''అది ఆత్మహత్యే ఔతుంది''
''అలా కాదు. నేననేది ఏమంటే ఈ విషయం నాకు తెలియకపోతే, నొప్పిలేకపోతే, నేను హాయిగా తింటూ తిరుగుతూ మీ దగ్గరకు రాకపోతే, టెస్ట్‌లు జరక్కపోతే, ఎంతకాలం బతుకుతాను?''
పెద్ద డాక్టరు భుజాలెగరేసి ''చెప్పలేం. నాల్గు లేక ఐదు నెలలు. మన అదృష్టం'' అన్నాడు.
ఇంటికెళ్లి రషీద్‌ తన జీవితం తాలూకు జమా ఖర్చులు చూసుకొన్నాడు. అంతా సజావుగానే వుంది. చాలా వింతగా వుందనుకొంటూ ఆలోచించసాగాడు- ఎంతో సంపాదించాను. ఖర్చు పెట్టాను. అందరూ తనను అదృష్టవంతుడివనేవారు. చావు గురించి ముందుగా ఎవరికీ తెలియదు. అకస్మాత్తుగా గుటుక్కుమంటారు. నాల్గయిదు నెలల జీవితం తన చేతిలో వుందన్న విషయం తనకు తెలుసు. ఆలోచనల్ని ఎంతగా అడ్డుకొన్నా అవి ఆగవు. వద్దనుకొన్నా గత జీవితమంతా సినిమా రీలులా తిరుగుతోంది.
ఇన్నేళ్లుగా ఇల్లు, ఆఫీసు సర్వస్వంగా బతికాడు. తన బాధ్యతల్ని సరిగానే నెరవేర్చాడు. తల్లిదండ్రులకు సేవ చేశాడు. తమ్ముడ్ని చదివించాడు. చెల్లెళ్ల పెళ్లి చేశాడు. తన ముగ్గురి పిల్లల్లో ఇద్దర్ని అల్లా తీసుకెళ్తే ఉన్న ఒక్కడు డాక్టరు కాగానే పెద్ద చదువులకని అమెరికా వెళ్లాడు. తనే పంపాడు. పిల్లల సంతోషమే తమ సంతోషమనుకొన్నాడు.
''మళ్లీ తిరిగి రావద్దని అనలేదే! చదువయ్యాక అక్కడే సెటిలయ్యాడు. పనికిమాలిన వెధవ! ఉద్యోగంలో చేరానని ఉత్తరం రాశాడు. కనీసం తను అనుమతైనా కోరలేదు'' అనుకునేవాడు తరచూ.
రషీద్‌ ఉద్యోగానికి రాజీనామా చేశాడు. ఎవరికీ అసలు విషయం చెప్పలేదు. సహోద్యోగులకు మాత్రం తన స్వగ్రామం వెళ్లి శేష జీవితాన్ని ప్రశాంతంగా గడపాలనుకొంటున్నానని చెప్పాడు. గ్రామంలో సొంత ఇల్లుంది. ఇక్కడేముంది! రణగొణధ్వని తప్ప! అక్కడ ఒంటరిగా ఎలా వుంటావని మిత్రుడు అడిగితే.
''ఇక్కడా ఒంటరినే కదా అని నవ్వుతూ ఆ విషయాన్ని దాటేశాడు. అక్కడకెళ్లి పావురాలు, చిలకలు, పిల్లులు, కుక్కల్ని పెంచుతాను. వాటితోనే ముచ్చట్లు చెప్తాను. అక్కడ గ్రామంలో ఒంటరితనమనేది వుండదు. అగ్గిపెట్టెల్లాంటి ఇళ్లలో వుంటున్న నగరవాసులే ఒంటరితనం ఫీలవుతారు'' అన్నాడు.
''అస్లమ్‌ను అడిగారా?''
''ఆ వెధవను అడిగేదేమిటి. వాడు నాకు తండ్రా లేక నేనతనికా? అంటూ రఫీక్‌ పగలబడి నవ్వాడు. ఇలా మనసారా నవ్వటం ఇంతముందెవరూ చూడలేదు. నిజంగానే కొడుక్కి ఈ విషయం తెలియపర్చలేదు. ఆరునెలలకొకసారి ఉత్తరం వస్తుంది. మిగిలిందీ ఇక ఆరునెలలే. వాడికీ విషయం తెలియదు.
ఒక వారం పదిరోజుల్లో చావు వుందనుకొంటే త్వరగా వచ్చి పని పూర్తిచేసుకొని వెళ్లమని రాయొచ్చు. ఆరునెలల ముందే ఎందుకు వాడిని బాధపెట్టటం. సుఖపడే రోజులు కదా వాడివి. ఔనా! అనుకొంటూ తన మనసుకు తనే నచ్చచెప్పుకొనేవాడు. వాడికేమని చెప్పను. వచ్చినా దగ్గరవుండి నా చావుకోసం ప్రతీక్షిస్తూవుండమని చెప్పనా! వెళ్లాల్సివస్తే దర్జాగా వెళ్తాను. ఎవరి దయాదాక్షిణ్యాలు నాకవసరం లేదు. డాక్టర్లూ, కొడుకూ ఏం చేస్తారు. కొడుకు వస్తే హాస్పిటల్‌లో చేరుస్తాడు. మందులు, వాసన. ఆరేడు నెలలు అక్కడ మగ్గిపోవాలి. ముసలితనంలో ఈ శిక్షేమిటి!
అరే రషీద్‌మియా. నీవు ముసలివాడివెప్పుడయ్యావు. నీకేం బాగానే వున్నావు. ఆఫీసులో పనిచేసే అమ్మాయిలెవరూ నీముందు నిర్లక్ష్యంగా కూర్చోరు. అమ్మాయిలొచ్చి నీతో కష్టసుఖాలు చెప్పుకొంటూ నీ సలహాలడిగినపుడే నీవు పెద్దవాడి కింద జమ. అర్థమైందా అనుకొంటూ తన ఆలోచనలకు తనే నవ్వుకొనేవాడు.
తనకవసరమైన సామానులుంచుకొని మిగతావన్నీ అమ్మేశాడు. గ్యాస్‌స్టవ్‌ అమ్మేసి కిరోసిన్‌ స్టవ్‌ కొన్నాడు. ఒక హరికేన్‌ లైట్‌, చెప్పులు, బూట్లు, తెల్లకాగితాలు, షేవింగ్‌ సెట్‌, అత్తరు సీసా, ఒక పెట్టెనిండా పుస్తకాలు, మరో పెట్టెలో వంటసామానుతో ప్రయాణానికి సిద్ధపడ్డాడు. సెలవల్లో ఎక్కడికో విశ్రాంతి కోసం వెళ్తున్నట్లు మనసు, శరీరం హాయిగా గాలిలో తేలిపోతున్నట్లుగా వుంది.
సామానంతా అమ్మేసి లెక్క చూచుకొంటే చాలా డబ్బు చేతికందింది. ఇంత డబ్బు జీవితంలో కళ్లచూడలేదు. ఈ డబ్బంతా ఐదారు నెలల్లో ఖర్చు పెట్టాలి. అరే మియా రషీద్‌! నీవిప్పుడు ధనికుడివి. జీవితంలో మొదటిసారి రషీద్‌ ఫస్ట్‌ క్లాస్‌లో ప్రయాణం చేశాడు. స్టేషన్‌ నుంచి టాక్సీలో తన గ్రామంలోని పాత బంగళాకు చేరాడు.
బంగళా తలుపులు ఎన్నో ఏళ్లుగా మూసున్నాయి. తాళం తీయబోతే అది రాలేదు. తుప్పుపట్టినట్లుంది. 'ఏం మిత్రమా, నీకూ కడుపులో కేన్సర్‌ లావుందే' తాళంతో మౌనభాషతో మాట్లాడాక మనసు చివుక్కుమంది. రషీద్‌మియా, నీకు మంచీ చెడూ బొత్తిగా తెలియదు. ఇంట్లోపాదం పెట్టబోతూ ఇలాంటి పాడుమాట లేమిటంటూ తనను తానే మందలించుకొన్నాడు. నూనె వేశాక తాళం తెరచుకొంది. మిత్రమా, నీవు ఈ లోకం పోకడను బాగా వంటబట్టించుకొన్నావే, తడపనిదే పని జరగలేదంటూ తాళాన్ని ఎత్తిపొడిచాడు. తలుపులు పెద్దమోతతో తెరుచుకొన్నాయి. గోల చేయకండి. మీకూ నూనె తాగిస్తానంటూ వాటినీ ఎగతాళి పట్టించాడు.
సాయంత్ర సమయంలో టాక్సీ హారన్‌ విన్న వీధిలోని పిల్లలంతా పరుగెత్తుకొంటూ వచ్చారు. దూరంగా నిలబడి తర్వాత నెమ్మదిగా దగ్గరకు వచ్చారు. వారిని రషీద్‌ ఓరకంటితో చూచి 'మిత్రమా, వీళ్లతో స్నేహం పెంచుకోకు, నిన్ను తేలికగా వదలరు. ఇక్కడకు హాయిగా కాలం గడపటానికొచ్చావు. పిల్లల్ని పెంచటానికి కాదంటూ తననుతాను హెచ్చరించుకొన్నాడు. పిల్లల్ని పట్టించుకోకుండా సామాను లోపలికి చేర్పించి, టాక్సీ బాడుగ చెల్లించి తలుపేసేశాడు.
ఇల్లంతా చీకటిగా వుంది. అదోరకం వాసన. రషీద్‌మియా అంటూ తనలోతానే అనుకొన్నాడు. ఇంట్లోవుంటూ, వాడుతూ, కడుగుతూ, తుడుస్తూనేవుంటే ఇల్లు కళకళలాడుతుంది. ఆడదానిలా స్త్రీని ప్రేమిస్తూ, లాలిస్తూ ఆమెతో కాలం గడిపితే ఆమె వంటా వార్పూ చేస్తూ పిల్లల్నికంటూ, గుడ్డలుతుకుతూ, ఇల్లు తుడుస్తూ, గృహలక్ష్మిలా శోభిస్తుంది. భార్యను వదిలేసినా, పట్టించుకోకపోయినా ఇల్లు ప్రేత దర్బారులా వుంటుంది.
రషీద్‌ దుమ్ముదులుపుకొని మంచంమీద కూర్చున్నాడు. ఫరీదా ఇంట్లో నవ్వుతూ, తుళ్లుతూ తిరుగుతున్నట్లనిపించింది. ఆమె తందూరీ రొట్టెలు కాలుస్తుంటే ఆ కాల్పనిక సువాసనల్లో అతను మునిగిపోయాడు.
మర్నాడు పక్షుల కిలకిలారావాలతన్ని మేల్కొల్పాయి. అలాగే నిద్రమత్తులో స్లిప్పర్లు తొడుక్కొని దర్వాజా వైపు రెండడుగులు వేశాడో లేదో ఠక్కున ఆగిపోయాడు. చిరునవ్వుతో ''ఏం రషీద్‌మియా, దర్వాజా బైటున్న వార్తాపత్రిక కోసం ఆగావా'' సిగరెట్‌ వెలిగించి కమోడ్‌మీద ప్రపంచవార్తలన్నీ తెలుసుకోవాలనుకొన్నావా? అయ్యా, ఇది దరియాగంజ్‌ కాదు. మీ గ్రామం. కాస్త మేల్కోండి. నీళ్లచెంబుతో పొలాల్లోకి పదండి'' అంటూ తనను తాను హెచ్చరించుకొన్నాడు.
చెంబు ఊపుకొంటూ తిరిగి వస్తుంటే బాల్యస్మృతులన్నీ చుట్టుముట్టాయి. వాటిని తలుచుకొంటూంటే మనసు వెన్నముద్దయిపోతుంది. స్వచ్చంగా నవ్వుకొన్నాడు.
ఎటుచూచినా పచ్చనిపొలాలే. గిలిగింతలు పెట్టే గాలి. అక్టోబరు నెల సగంలో వుంది. అక్టోబరు, నవంబర్‌, డిశంబర్‌, జనవరి, ఫిబ్రవరి- రషీద్‌ లెక్కపెడ్తున్నాడు. చాలా రోజులుగా ఇలా వెక్కిరిస్తూనే వున్నాడు.
మార్చి చాలా అందమైన నెల. చలి, వేడి ఏవీ వుండవు. ఎంతో నాజూకైన నెల. ఎక్కడికైనా వెళ్లాలన్నా, ఏ పని చేయాలన్నా వాతావరణం అనుకూలంగా ఉండటం ముఖ్యం. చివరకు చావుకైనా- మళ్లీ అదే సంగతి. చావంటే ఏమంత గొప్ప విషయం. లోకంలో సాధారణంగా జరిగేదే. అతనికి భార్యాబిడ్డలు గుర్తొచ్చారు. ఇద్దరు పిల్లల్నీ, భార్యనీ కోల్పోయాక అల్లా అస్తిత్వాన్ని ఆక్షేపించాడు. ఉంటే ఉంటాడు. లేకపోతే లేదు. నాకేంటి అనుకొన్నాడు.
రషీద్‌ దీక్షగా ఇంటి శుభ్రత మొదలెట్టాడు. ఇంటినిండా పాత సామాను కుప్పలు కుప్పలుగా ఉంది. వ్యవసాయ పనిముట్లు, వంటసామాను. విరిగిన ఫర్నిచర్‌, ఇలా లెక్కలేనన్ని సామాన్లు. ఒకప్పుడు వీటిని ఉపయోగించేవారితో ఇల్లంతా నిండుగా కళకళలాడుతూ ఉండేదని అర్థమౌతోంది.
ఇంటిముందు గులాబితోట వేయించాడు. పూలు పూసేది మార్చి ముందా తర్వాతా అని లెక్కలేశాడు. ఎన్నో పావురాల్ని పెంచాడు. తెల్లనివి, బూడిదరంగువి. ఎంతో ముద్దొచ్చేవి. వాటితో ఊసులాడేవాడు. ఎందుకలా గోలచేస్తారు? మీ కోసమే కదా డాబామీద గింజలు జల్లాను. నమ్మకం లేదా. తిండిమీద కెందుకలా ఎగబడ్తారు. రోజంతా తినొచ్చు. అరవొచ్చు. ఎగరొచ్చు. నాజూకు కాళ్లమీద గుండ్రంగా తిరుగుతూ నాట్యం చేయొచ్చు. అంటూ గారం చేసేవాడు.
తెల్లవారగానే పావురాన్ని చిన్నపిల్లల్లా మందలిస్తూ- ''ఒకటే గోల. మీ అరుపుల్తో నన్ను లేపేశారు కదా. నన్ను నిద్ర లేపటానికి మీరిలా అరుస్తున్నారా'' అనేవాడు. ''ఓ పెద్దమనిషీ, నిద్రపోవటానికి చాలా సమయముంది. నాల్గయిదు నెలల తర్వాత నిద్రపోవటం తప్ప ఇంకేం పనుంది. ప్రస్తుతం మేల్కో. చుట్టూ చూడు. ప్రకృతి అందచందాల్ని పరిశీలించు. వాటిని చూచి స్పందించే మనసుంటే ఇకలేనిది ఏముంది. పూలబాలల పలకరింపులు. ఆకుల గుసగుసలు విను. నీలాకాశం, పైరు పచ్చని పుడమి తల్లి, వెలుగు, వెన్నెల, ఎన్నో ఉన్నాయి చూచి తరించటానికి. బుుతుచక్రం తిరుగుతుంది. వెలుగు చీకట్లు వంతులేసుకొని తిరిగివస్తాయి. కాలమొక్కటే తిరిగిరాదు.
రషీద్‌ అంతా చూసి అబ్బురపడ్డాడు. ''ఈ మనోహర వాతావరణం, మొక్కలు, పశువులు ఇవన్నీ నా ప్రపంచంలో మొదటి నుంచీ వున్నాయా! ఐతే ఎక్కడ దాక్కున్నాయి?''
''నీకు కనపడకుండా అవి దాక్కోలేదు రషీద్‌. నీవే వాటికి కనపడకుండా దాక్కున్నావు. ఇన్నాళ్లు ఇల్లు, ఆఫీసే లోకంగా బతికావు. ఆఫీసర్‌ చీవాట్లకు బాధపడటం, ప్రమోషన్లకు సంతోషించటం చేస్తూ వచ్చావు. ఉదయం లేవగానే పత్రిక చదవటం, టీ తాగటం, బస్‌కోసం క్యూలో నిలబడి నిరీక్షించటం. కిళ్లీ నముల్తూ, సిగరెట్‌ కాలుస్తూ జీవితం తాలూకు స్వల్ప సుఖాలననుభవిస్తున్నానని ఆనందించటం, విందులు, వినోదాల్లో పాల్గొంటూ, మిత్రుల కష్టసుఖాల్లో పాలుపంచుకొంటూ అదే జీవితమని భావించావు. అమ్మానాన్నను ఇద్దరు కొడుకుల్ని, భార్యని పోషించావు. ఉషోదయంలో పక్షుల మధుర గానాలు, ఆకాశాన్ని రాగరంజితం చేసే ఉషాకాంత సోయగాలు, నీలాకాశం, వెండిమబ్బులు, సస్యశ్యామలమైన నేలతల్లి, వీటికి దూరంగా బతికావు'' అని సమాధానం చెప్పుకునేవాడు.
చిలుకలు, పావురాలు, పిల్లులు, కుక్కలు వాటితో ఆటపాటలు, ప్రేమగా బుజ్జగింపులు, లాలింపులు. వీటితో మైమరచిపోయేవాడు. ధాన్యపు గింజలు తింటూ వుంటే పావురాల మెడమీద ఎండపొడపడి గులాబి, వంగపండు రంగులో మెరిసిపోయేవి. పావురాల జంటలు గుండె లోతుల్లోంచి ప్రేమ ఊసులు చెప్పుకునేవి. ఒకదాని మెడను మరొకటి ముక్కుతో పొడిచేవి. రెక్కలు నిమిరేవి. పులకింతలతో పరవశించేవి.
మూడు నాలుగు పిల్లులూ చేరాయి. పావురాలకీ పిల్లులకీ శత్రుత్వమే. ఐనా రషీద్‌ దగ్గర ఉండాలంటే అలాంటి భావాల్ని వదిలేయాలన్న విషయం పిల్లులు అర్థం చేసుకొన్నాయి. పావురాలకేమీ అపకారం చేయకపోతే వుండనిద్దాం వీటినీ నష్టమేముంది. కొద్దిగా పాలూ రొట్టే కదా ఖర్చు అనుకొన్నాడు రషీద్‌.
రషీద్‌ పిల్లుల్లో ఒకటి పిల్లల్ని పెట్టింది. దూది బంతుల్లాంటి చిన్న చిన్న పిల్లుల్ని ఎత్తుకొన్నప్పుడు వాటికి రవంతయినా బాధకల్గకుండా చూచేవాడు. పావురాల మెత్తని పొట్ట కింద ఉన్న గ్రుడ్లను మోకాళ్లమీద కూర్చొని చూస్తుంటే అవి సిగ్గుతో ముక్కు పక్కకు తిప్పేసుకొనేవి. ''ఇంకా ఎన్ని రోజులు పడ్తుంది బేగం'' అంటూ నవ్వుతూ అడిగేవాడు.
దుర్భరమైన కడుపునొప్పితో తల్లడిల్లిపోయినపుడు తన ప్రాణమంతా ఒక ముద్దలా కుళ్లిపోయిన పొట్టలో దాక్కొందా అన్పించేది రషీద్‌కు. ఎంత బాధనైనా ఓర్చుకొనేవాడు కాని మందు వేసుకొనేవాడు కాదు. భరించలేనంత బాధగా ఉన్నపుడు పూలమొక్కల్లో తిరిగేవాడు. అంట్లు కట్టేవాడు. మొక్కలు నాటేవాడు. నాటిన మొక్కలు వాడిపోవటం, మరునాడు తేరుకోవటం, నాల్గయిదు రోజుల్లో కొత్త చిగుళ్లు రావటం ఇదంతా చిత్రంగా, అద్భుతంగా ఒక మాయలా అన్పించేదతనికి.
ఊరంతా తిరుగుతూ కొన్ని పిల్లుల్ని వెంటబెట్టుకొచ్చేవాడు. మరిన్ని పావురాల్ని కొనితెచ్చేవాడు. ఇరుగుపొరుగు పిల్లల్ని పిలిచి కధలు చెప్పేవాడు. స్కూలు పిల్లల హోంవర్క్‌ చేయించేవాడు. ఒక్కోసారి తనను తానే ఆశ్చర్యంగా ప్రశ్నించుకొనేవాడు - ''రషీద్‌మియా, ఒక విషయం నాకు బుర్రకెక్కటం లేదయ్యా. నీ పొట్టలో నొప్పికి పిల్లలకి, పిల్లులకి, పావురాలకీ ఏమి సంబంధం. కాస్త చెప్పవయ్యా?''
ఒకసారి నొప్పి ఉధృతంగా వచ్చినపుడు ఎక్కడికోవెళ్లి చిలకలు కొని తెచ్చాడు. వాటికి పంజరాలు తయారు చేశాడు. వాటి నీటికి తిండికి అందులో ఏర్పాటు చేశాడు. ఈ పనుల్లో రోజు ఎలా గడచిపోయేదో తెలిసేది కాదు. ఒక రోజును ఎలా మోసగించి పంపావంటే మొహం వేలాడేసుకొని వెళ్లిపోయింది. తెలివంటే నీదేనంటూ తనను తాను పొగుడుకొనేవాడు. రాత్రిపూట నిద్రవచ్చినా రాకపోయినా ఉదయమే లేచేవాడు. ఇప్పుడిప్పుడే తాను పుట్టినట్టు ప్రకృతంతా ఇప్పుడే తన కోసం సృష్టించబడినట్లు అన్పించేది.
డాబా మీద పడుకొంటే బాల్యమంతా అతని మంచం పట్టీమీద వచ్చి కూర్చొనేది. చుక్కలన్నీ కిందకు దిగి అతనితో ఊసులాడేవి. చిన్నప్పుడు ఈ డాబా మీదే నిద్రపోయేవాడు. అర్ధరాత్రి వానొస్తే డాబాల మీద మంచాలు లాగటం, పిల్లల ఏడ్పులు మొదలయ్యేవి.
మధ్యాహ్నం ఎండ కుందేలు శరీరంలా మెత్తగా హాయిగా వుంది. రషీద్‌ ఆ ఎండలో కూర్చొని కునికిపాట్లు పడేవాడు. ఆ నిద్రమత్తులో అల్లాతో మాట్లాడేవాడు. ఎన్ని వరాలిచ్చావయ్యా మాకు. వాటిని మేము పట్టించుకోకుండా ఒక పరిధిలో గానుగెద్దుల్లా తిరుగుతున్నాం. డాక్టర్లు నా జీవితాన్ని ఆరు నెలలకు కుదించకపోతే నేనూ ప్రకృతి అందాల్ని మిస్‌ అయ్యేవాణ్ణి. అనూహ్యంగా నాకీ సువర్ణావకాశం లభించింది. అంటూ భావోద్రేకంతో, ఉద్విగ్నతతో నిండిపోయి పొంగిపోయేవాడు.
* * *
ఒకరోజు పడవసరంగు కొడుకును పిలిచి ''బాబూ రేపు స్కూలు నుంచి వచ్చాక నా దగ్గరకురా. నాకు పశువుల శాల బాగు చేయటంలో కాస్త సాయంచెయ్యి. ఇప్పుడు పశువులు లేకపోయినా శుభ్రంచేసి వుంచితే తర్వాత ఎప్పుడైనా వాటికి ఉపయోగపడ్తుంది.''
ఎవరి పశువులు? ఆలోచిస్తున్నాడు. అరే, రషీద్‌మియా. ఈ ఇంట్లో నీవు పోయాక ఎవరో ఒకరు వచ్చివుంటారు. తలుపులు తెరిచే వుంచుతారు. అస్లమ్‌ ఎలాగూ రాడు. ఎవరో ఒకరు ఇందులో వుంటే భూతాల గృహం కాకుండా వుంటుంది. ఒకప్పుడు ఈ పశువులశాలలో ఎన్నో జాతిగేదెలపాల సుగంధం, వాటి ఉచ్చ్వాసనిశ్వాసాలు, పచ్చిగడ్డి వాసన, పాలుపిండేటప్పుడు వచ్చే సున్నితమైన ధ్వని, కాటుకకళ్ల దూడలు, అవి మెడలో గంటలతో చెంగుచెంగుమని ఎగురుతూంటే అబ్బ! ఎంత బాగుండేదో!!
ఇప్పుడక్కడ ఏమీ లేదు. ఆ కమ్మని పాలవాసనలు, పాలధారలు, ఎద్దుల ముక్కుల నుండి వచ్చే బుసతో కూడిన ధ్వనులు, ఏవీ లేవు. చాలా కాలంగా శూన్యంగా వుంది. చిలుము పట్టిన బకెట్లు, గడ్డితవ్వే పారలు.
శాలను శుభ్రపరిచేసరికి బాగా అలిసిపోయాడు రషీద్‌. మనసు కూడా బాగా లేదు. పంపు దగ్గర చేతులు కడుక్కొని పడుకున్నాడు. సరంగు కొడుకు మంచం దగ్గరకొచ్చి నిలబడ్డాడు.
''నీకు గాలి పటాలెగరేయటం వచ్చా సోమూ?''
''పోయిన సంవత్సరం వసంతోత్సవంలో ఎగరేశాను''
జేబులోంచి ఐదు రూపాయలు తీసియిస్తూ ''గాలిపటం, దారం కొనుక్కురా. మిగిలిన డబ్బు నీవు తీసుకో'' అన్నాడు.
పిల్లవాడు పరుగెత్తుకొంటూ వెళ్లి రెండూ కొని తెచ్చాడు. ఇద్దరూ గాలిపటం ఎగరేయటానికి కావలసిన ఏర్పాట్లన్నీ చేశారు.
''సోమూ, నేను గాలిపటం ఎగరేశాక దారం గట్టిగా పట్టుకో''.
రషీద్‌కు సోమూ తన కొడుకు అస్లమ్‌లా అన్పించాడు. గతంలోని ఆ వైపు నుంచి చూస్తున్నాడు. దరియాగంజ్‌ ఇంట్లో గాలిపటాలెగరెయ్యాలని ఉబలాటపడ్డాడు అస్లమ్‌.
అరే భడవా. ఈ ఇరుకు సందుగొందులు. ఆపైన అంతెత్తు భవనాలపై టి.వి. యాంటినాలు. గాలిపటం ఎలా ఎగురుతుందిరా?!
అస్లమ్‌ జ్ఞాపకాన్ని అవతలపెట్టి గాలిపటాన్ని ఒక ఊపుతో పైకి గాలిలోకి విసిరాడు. ఆ ఊపుకి కడుపులో కత్తి పెట్టి పొడిచినట్లుగా నొప్పివచ్చి గుక్కెడు రక్తం కక్కుకున్నాడు. ఆకాశంలోని నీలి రంగంతా అతని కళ్లలో ఇమిడిపోయి నల్లగా మారిపోయింది.
సోమూ దృష్టంతా ఎగిరే గాలిపటం మీదుంది. దాని సమీపంలోనే రషీద్‌ పావురాలు ఎగురుతున్నాయి. కింద ఇంటిముందు చిలకలు పాడుతున్నాయి.